ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాఖీలు కట్టిన హిళా మంత్రులు,మహిళ నేతలు
అమరావతి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీమంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత, తదితరులు ఉన్నారు.

