NATIONAL

ప్రకృతి సృష్టించిన జల ప్రళయంలో 80 మంది ఇషా ఫౌండేష‌న్ స‌భ్యుల‌ను కోల్పోయం-స‌ద్దురు జ‌గ్గీవాస్ దేవ్

అమరావతి: నేపాల్‌లో ప్రకృతి ప్రకోపం కారణంగా సంబవించిన అక‌స్మిక వ‌ర‌ద‌ల కార‌ణంగా పదుల సంఖ్యలో ఇషా ఫౌండేష‌న్ స‌భ్యుల‌ను కోల్పోయామ‌ని స‌ద్దురు జ‌గ్గీవాస్ దేవ్ వెల్లడించారు.ఈ ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా త‌మ యాత్రా బృందంలో 80 మంది మ‌ర‌ణించార‌ని వెల్ల‌డిస్తూ,, బుధ‌వారం నాటి భ‌యాన‌క దృశ్యాలను త‌ల‌చుకున్న ఆధ్యాత్మిక గురువు క‌న్నీళ్ల‌తో ఈ విషాద వార్త‌ను పంచుకున్నారు.

అక‌స్మిక వ‌ర‌ద‌లు మిగిల్చిన విధ్వంసం తీవ్ర‌త‌ను చూడండి. ఎక్క‌డ‌చూసినా భీతావ‌హ దృశ్యాలే. ఈ విప‌త్తు భ‌యాన‌క‌మైన‌ది. అసాధార‌ణ‌మైన‌ది. కైలాష్ మాన‌స్‌స‌రోవ‌ర్ యాత్ర నుంచి తిరిగి వ‌స్తున్న మా బృందం వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇషా స‌భ్యులైన‌ 80 మందిని కోల్పోయాం.యాత్ర‌కు వెళ్లిన బృందం నాయ‌కుడు ఇషాంగ ప్ర‌వీణ్ నుంచి నాకు ఉద‌యం 9.05 గంట‌ల‌కు తాము ఇమ్మిగ్రేష‌న్ సెంట‌ర్ చేరుకున్న‌ట్టు సందేశం పంపాడు. ఆటు త‌రువాత‌ 9 నిమిషాల‌కే ప్రకృతి ప్రళ‌యం సృష్టించింది. వారం క్రితం నేను ఉన్న ఇమ్మిగ్రేష‌న్ సెంట‌ర్, ఇప్పుడు వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయింది అని స‌ద్గురు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.వ‌ర‌ద‌ల కార‌ణంగా దారుణంగా దెబ్బ‌తిన్న గైరాంగ్‌కు వెళ్లేందుకు త‌న‌ను అనుమ‌తించాల‌ని భార‌త‌, చైనా దౌత్య కార్యాల‌యాల‌ను కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *