AP&TGCRIME

డిప్యూటీ సీఎం పవన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి..డిప్యూటీ సీఎం పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడి ఫోన్ చేసి బెదిరించాడు..అలాగే పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు.. దీంతో పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్,, మెసేజ్‌ల గురించి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే తెలియజేశారు..ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి,, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పెట్టిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు..తక్షణమే ఘటనపై చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు..ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు..ఈ బెదిరింపుల వ్యవహారంలో రేషన్ అక్రమ రవాణా మాఫియా హస్తం ఏమైనా ఉందా?.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *