నిరసనల్లో హింసాత్మక సంఘటనలపై పోలీసులు కఠిన చర్యలు-పాస్‌పోర్ట్ లను రద్దు
అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లతో పాటు ఆరుగురు పోలీస్ సిబ్బంది..
అమరావతి: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్ లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. నిరసనల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాల ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యావ్యవస్థలో అవకతవకలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు-పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో కొందరు నిరసనకారులు ముందుగానే సిద్దం చేసుకున్న రాళ్లతో దాడులకు దిగారు.ఈ సంఘటనలో ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లతో పాటు ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్ లను రద్దు చేసేందుకు చర్యలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

