AP&TGNATIONAL

భారీ నుండి అతి భారీ వర్షాలు-రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: ఉత్తర భారతదేశం నుండి హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు విస్తరించి ఉన్న 7,000 నుండి 10,000 కిలోమీటర్ల పొడవైన అద్భుతమైన rain bandని తాజా ఉపగ్రహ చిత్రాలలో కనిపించింది. 2026 నైరుతి రుతుపవనాలు చురుకైన దశలలో వున్నాయని సూచిస్తోందని సంబంధిత శాఖ అంచన వేసింది.

అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశం అంతటా వర్షపాతం నమోదైంది. వర్షపాత అంచనాల ప్రకారం, గత రెండు రోజుల్లో దేశంలో సాధారణ రోజువారీ రుతుపవనాల వర్షపాతంలో సుమారు 170-180% నమోదైంది. దీంతో ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం కురిసిన నెలగా ఇది నమోదైంది.

ఉత్తర కొంకణ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కొంకణ్ & గోవా-దక్షిణ మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్:- శుక్రవారం విజయనగరం,మన్యం అల్లూరి,పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ  వెల్లడించింది. అలాగే విశాఖ, అనకాపల్లి,బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *