ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్‌ఎస్ అధికారిణి నిధి తివారీ నియమకం
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా యువ IFS Officer అయిన నిధితివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.. మార్చి 29న సిబ్బంది-శిక్షణ శాఖ (DoPT) జారీ చేసిన మెమోరాండం ప్రకారం, క్యాబినెట్ నియామకాల కమిటీ తివారీ నియామకాన్ని తక్షణమే అమలులోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది..
నిధి తివారీ 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (IFS) అధికారిణి..ఆమె స్వస్థలం వారణాసిలోని మెహ్ముర్‌గంజ్.. సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంకు సాధించారు..ఆమె ఇప్పటివరకూ పలు హోదాల్లో PMOలో పనిచేశారు..2022 నవంబర్‌లో ఆమె PMOలో అండర్ సెక్రటరీగా,,జనవరి 6, 2023 నుంచి నేటి వరకు ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.. PMOలో బాధ్యతలు చేపట్టడడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలో పని చేశారు.. నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా నిధి తివారీ బాధ్యలు నిర్వహించారు..ఇప్పటి వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇద్దరు ప్రైవేట్ సెక్రటరీలు వివేక్ కుమార్, హార్దిక్ సతీశ్చంద్ర షా ఉన్నారు..మూడవ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియమితులయ్యారు.