హిమాలయాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రతీసారి-సునీతా విలియమ్స్
అమరావతి: భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్,, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సంకేతిక సమస్యలతో 9 నెలల పాటు అక్కడే ఉన్న విషయం విదితమే..మార్చి 19వ తేదిన భూమిపైకి తిరిగి వచ్చిన తరువాత ఆరోగ్య పరిక్షల నిమిత్తం ఇంత వరకు అబ్జర్వేషన్ లో వున్న అమె మరో వ్యోమగామి విల్మోర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు..286 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న సందర్భంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను వారు వివరించారు.. మళ్లీ అంతరిక్షంలోకి వెళతారా అన్న విలేకరి ప్రశ్నకు తడుముకోకుండా “యస్” అంటూ సమాధానం చెప్పారు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాము మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని,,తమ ఇబ్బందులకన్నా,, మానవళి కోసం పనిచేయడమే తమకు ముఖ్యమన్నారు..ఈ బృహత్తర లక్ష్యం ముందు వ్యోమనౌకలో తలెత్తిన సమస్యలు చాలా చిన్నవే అన్న భావం స్పూరించేలా సమాధానం ఇచ్చారు.. అంతరిక్షం నుంచి రాగానే,, తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు సునీతా విలియమ్స్ తెలిపారు.. భూమ్మీదకు వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణానికి తాను అలవాటు పడుతన్నట్లు ఆమె వివరించారు..
తన తండ్రి మాతృభూమి గురించి అద్భుతంగా అభివర్ణించారని,,హిమాలయాలు చూసిన ప్రతీసారి తాము ఎలా అనుభూతి చెందామో వివరించారు..ముంబైతోపాటు, తన తండ్రి స్వరాష్ట్రం గుజరాత్ ఎలా కనిపించేదో వివరించారు.. భారత్‌కు పెట్టనికోట అని పిలుచుకునే హిమాలయాలు పై నుంచి చూస్తే ఇలా ఉంటాయి..సుదీర్ఘమైన మంచుపర్వతాల శ్రేణి, ప్రపంచంలోనే రమణీయంగా ఉంటుంది..ఈ రమణీయతకు ముగ్దులు కానివారి ఉండరని పేర్కొన్నారు..వీలైనంత తర్వలోనే ఇండియాలో పర్యటించనున్నట్లు చెప్పారు. అంతరిక్ష పరిశోధనల గురించి భారతీయులతో ముచ్చటిస్తానని కూడా వెల్లడించారు.