ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి జలుల్లు,ఉష్ణొగ్రతలు తగ్గే అవకాశం
అమరావతి: అదివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి సోమవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర, అంతర్గత విదర్భ మీదుగా మరట్వాడ ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వాతావరణశాఖాధికారులు పేర్కొన్నారు.. ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది..మంగళవారం నుంచి వచ్చే నాలుగు రోజులు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడకు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది..బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని,, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగళ్లు కురుస్తాయని హెచ్చరించింది..
ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచనలు:–
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది..
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.మంగళ,బుధవారల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది..గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది.
రాయలసీమ:- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది..గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.. మంగళ,బుధవారాల్లో:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం..ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.