INTERNATIONALNATIONALOTHERS

అడ్డదారుల్లో పాక్ దాడులకు ప్రయత్నం-బలంగా తిప్పికొడుతున్నాం-విదేశాంగ శాఖ కార్యదర్శి

అమరావతి: పెహ‌ల్గామ్ మరణకాండ తరువాత భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం పాకిస్తాన్ చేస్తున్న దాడులను మనం ఎదుర్కొంటున్న తీరుపై తాజా సమాచారం ఇచ్చింది..ఢిల్లీలో విదేశాంగ శాఖ నేతృత్వంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్,,ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి,, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి పాల్గొని వివరాలు వెల్లడించారు.

కల్నల్ సోఫియా ఖురేషి:- భారత మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రి పాక్‌ దాడులు చేసేందుకు ప్రయత్నించిందని సోఫియా ఖురేషి తెలిపారు.. ఉత్తర ప్రాంతంలోని 26 ప్రదేశాలు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను,, భారత బలగాలు కూల్చివేశాయని వెల్లడించారు.

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్:-భారత్‌ చేసిన ఎదురు దాడిలో పాక్‌కు తీవ్ర నష్టం కలిగిందన్నారు.. పౌర విమానాలను కవచంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు పాల్పపడిందన్నారు..కరాచీ-లాహోర్‌ మధ్య పౌర విమానాలు తిరుగుతున్నాయని,,వాటిని అడ్డం పెట్టుకుని,,ఈ కుతంత్రలకు పాల్పపడుతొందన్నారు..అయిన మన ఎయిర్ ఫోర్స్ ఎంతో సంయమనం పాటిస్తోందన్నారు..ఎయిర్‌ స్పేస్‌ మూసివేసినట్లు పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని,, పాక్‌ ఎయిర్‌ స్పేస్‌ను మూసివేయలేదని వ్యోమికా సింగ్‌ తెలిపారు.

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి:- గురువారం రాత్రి పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు దిగిందని అయితే పాకిస్తాన్ దాడులను సమర్థంగా మన ట్రై సర్వీస్ లు తిప్పికొట్టాయన్నారు..పలు భారత నగరాలు లక్ష్యంగా పాక్‌ దాడులు చేసిందని తెలిపారు..గురువారం మనం చేసిన ఎదురు దాడుల్లో పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం జరిగిందన్నారు.. చాలా సార్లు పాకిస్తాన్ “సీస్ ఫైర్ ఉల్లంఘనలకు” పాల్పడిందని తెలిపారు.. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ అడ్డదారల్లో ప్రయత్నం చేస్తొందన్నారు..ఇదే సమయంలో మతం రంగు పూసేందుకు పాక్‌ యత్నిస్తోందని వెల్లడించారు..మన దేశంలోని ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని పాక్‌ చెప్పడం అబద్ధం అన్నారు.. భారత్‌పై పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని,, పూంఛ్‌లోని స్కూల్‌పై పాక్‌ దాడి చేసిందన్నారు..అయితే దాడి సమయంలో స్కూల్‌ మూసివేసి ఉందన్నారు..దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాక్‌ కుట్ర చేస్తోందని తెలిపారు..కర్తార్‌పూర్‌ కారిడార్‌ మూసివేయడం జరిగిందని,,పాక్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు.. పాకిస్తాన్ చర్యలపై మరోసారి IMFకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు..పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నమని చెప్పిన విక్రమ్ మిస్రి, సింధు జలాల ఒప్పందం రద్దు చేశాం అని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *