చంద్రబాబు నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?-వైఎస్ జగన్
సుపర్- 6 హామీల మోసం..
అమరావతి: చంద్రబాబు ఇదిగో నీ మోసం. ఎన్నికల్లో నువ్వు ప్రజలకు ఇచ్చిన సుపర్- 6 హామీల మోసం అంటూ వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వార్షిక బడ్జెట్‌పై సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదు.? అమలు చేసే ఉద్దేశ్యం ఉంటే బడ్జెట్లో ఆ స్థాయి కేటాయింపులు ఎందుకు చేయలేదు? హామీలు అమలు చేయకుండా నువ్వు చేసింది మోసం కాదా? ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా? అని నేను ట్వీట్ చేస్తున్నా. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ క్యాడర్ మొత్తం సోషల్ మీడియాలో ప్రశ్నించబోతున్నాం. నువ్వు ఇచ్చిన హామీల అమల్లో మాట తప్పిన నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదో సోషల్ మీడియా వేదికగా మేం ప్రశ్నించబోతున్నాం. పోలీసులు ఎంతమందిని అరెస్టులు చేస్తారో చూస్తాం. ఆ అరెస్టులు జరిగితే మొదటి అరెస్టు నాదే అవుతుంది.”అంటూ వ్యాఖ్యనించారు.