AP&TG

నెల్లూరుజిల్లా గూడూరులో అత్యధిక ఉష్ణోగ్రత 46.2 C-విపత్తుల నిర్వహణ సంస్థ

కోనసీమలో 72.7మిమీ..

అమరావతి: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 46.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీలు రికార్డయ్యాయని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో 46.2°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1°C, మార్కాపురం(జి) కంభం లో 45.7°C, తిరుపతి(జి) బోనుపల్లెలో 45.6°C, పల్నాడు(జి) నడిగడ్డలో 44.2°C, బాపట్ల(జి) కారంచేడులో 44°C, కర్నూలు(జి) తోవిలో 43.9°C, చిత్తూరు(జి) తవణంపల్లెలో 43.8°C, అనంతపురం(జి) తెరన్నపల్లి, కడప(జి) వీరబల్లెలో 43.4°C, నంద్యాల(జి) బనగానపల్లె, ఎన్టీఆర్(జి) చిలకల్లులో 43.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

వర్షాలు కురిసే అవకాశం:- మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం (04-05-26) అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ,  చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

వర్షపాతం:- ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 72.7మిమీ, కాట్రేనికోనలో  57.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 50.2మిమీ, పిఠాపురంలో 45.5మిమీ, కాకినాడ రూరల్ 43మిమీ, అచ్చుతాపురంలో 42మిమీ, కాకినాడ అర్బన్ 41మిమీ వర్షపాతం నమోదైందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *