పబ్లిక్ ఎగ్జామ్స్ లీకేజీ నిరోధక సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అమరావతి: సోమవారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నీట్‌తో పాటు పలు పేపర్ల లీకేజీ విషయమై పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా పేపర్ లీకేజీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే చట్టాన్ని రూపొందించనున్నారు. ఇటీవల ఢిల్లీలో సీజేపీ విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ విపక్షాలు సభలో నినాదాలు చేస్తున్న సందర్భంలోనే మంత్రి జితేంద్ర సింగ్ ఆ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం సవరణ చేసిన లీకేజీ నిరోధక బిల్లును మళ్లీ సవరిస్తూ కేంద్రం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. పేపర్ లీకేజీ ఘటనల పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామ్స్ లీకేజీ నిరోధక సవరణ బిల్లు ప్రకారం లీకేజీ కేసులను రెండు నెలల్లోనే పరిష్కరించనున్నారు.

