కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఆందోళనను విరమిస్తున్నాం..
అమరావతి: జాతీయ ప్రవేశ పరీక్షల్లో (నీట్) చోటుచేసుకున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP), పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ ఆందోళనలు, విద్యాశాఖ జవాబుదారీతనం వహించాలనే ఒత్తిడి మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా:-తన రాజీనామా లేఖను ఎక్స్ లో పోస్టు చేశారు.అందులో గత 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను తనను బాధకు గురిచేసినట్లు మంత్రి ప్రధాన్ పేర్కొన్నారు.ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు చెందిన విషయం కాదన్నారు. భారత యువశక్తియే ఈ దేశానికి అసలైన శక్తి అని అన్నారు. దేశ యువశక్తిని భ్రమలో పడకుండా చూస్తానన్నారు. ఇదే తన సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు.

