AP&TG

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి-మంత్రి పార్థసారథి

ఎల్ నినో ప్రభావం ఆగస్టు తరువాత మరింత..

ఆరుతడి పంటల సాగు వైపు..

ఎల్ నినో ప్రభావంతో38వేల క్యూసెక్కులే..

అమరావతి: ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది అధికంగా ఉంటుంది కాబట్టి రైతుల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో మంత్రులు,అధికారులు సమన్వయంతో సమస్య నుండి రైతులు గట్టెక్కే విధానాలపై కసరత్తు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎల్ నినో ప్రభావం ఆగస్టు తరువాత మరింత తీవ్రంగా ఉండనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఈ సాధారణం కంటే 51 శాతం కంటే ఎక్కువగా వర్షపాతం తగ్గుదల ఉంటుందని,దీంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కోనే పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారని కొలుసు పార్థసారథి తెలిపారు.గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి వెల్లడించారు.

ఆరుతడి పంటల సాగు వైపు:- రైతులు ఈ ఏడాది నీటి ఎద్దడిని ఎదుర్కొనే ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గుచూపాలని తద్వారా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని సూచించారు.అంతే కాకుండా భూగర్భ జలాలు సైతం అడుగంటే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.బోర్లు వేసి వ్యవసాయం చేద్దాం అనే ఆలోచనను రైతులు చేయవద్దని కోరారు.దీంతో భూగర్భ జలాలు మరింత అటుగంటే ప్రమాదం పొంచి ఉందని మంత్రి పార్థసారథి అన్నారు.

ఎల్ నినో ప్రభావంతో38వేల క్యూసెక్కులే:-  పోలవరం వద్ద గోదావరి నది ప్రతి ఏడాది ఈ సమయానికి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీరు ప్రవహించేదని కాని ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడటంతో ఈ ఏడాది కేవలం 35 నుండి 38వేల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే ప్రవహిస్తోందని దీంతో గోదావరి,కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సాగు నీరు అందని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అలాగే పశుగ్రాసం కొరత రాకుండా మెట్ట పంటల సాగు ఆలోచన చేయలని కోరారు. మన రాష్ట్రంలో 59 శాతం ఆయకట్టు భూమి,41 శాతం వర్షాధార పంట భూములు ఉన్నాయని,ఈ ఏడాది ఆరుతడి పంటల వైపు మొగ్గు  చూపాలని సూచించారు. అందుకు అవసరమైన విత్తనాల కిట్లను కూడా వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *