ఆరు జిల్లాలకు Red అలెర్ట్, ఆరు జిల్లాలకు orange అలెర్ట్- విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 50 నుండి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేసింది.

