AP&TG

కృష్ణా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: రాష్ట్రంలో రోహిణి కారై ప్రవేశంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. సోమవారం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

సోమవారం:- కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది.14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వెల్లడించింది.

మంగళవారం (26-05-2026) 26 మండలాల్లో తీవ్రవడగాల్పులు,137 మండలాల్లో వడగాల్పులు, బుధవారం 70 తీవ్ర, 176 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *