మంగళవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం- విపత్తుల నిర్వహణ సంస్థ
విజయవాడ తూర్పులో 42.3°C..
అమరావతి: ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం అదే ప్రాంతంలో కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
దీని ప్రభావంతో మంగళవారం (12-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం ఎన్టీఆర్(జి) విజయవాడ తూర్పులో 42.3°C, ఏలూరు(జి) కుక్కునూరు, పోలవరం(జి) కూనవరంలో 42.1°C, కర్నూలు(జి) మంత్రాలయంలో 41.5°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 41.4°C, కడపలో 41.3°C, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 41.2°C, పల్నాడు(జి) అచ్చంపేటలో 40.9°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 40.8°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి, నంద్యాల(జి) దొర్నిపాడులో 40.7°C,మర్కాపురం(జి) నందనమారెళ్లలో 40.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

