దిల్లీలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
అమరావతి: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ పేలడంతో ఓ అపార్ట్ మెంట్ లోని ప్లాట్ లో మంటలు చెరలేగాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. షాదార్లోని వివేక్ విహార్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది భవనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే 14 ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో మరింతమంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.10 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.పూర్తి వివరాలు అందాల్సి వుంది.

