NATIONALPOLITICS

పశ్చిమబెంగాల్ 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్-కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: పశ్చిమబెంగాల్ రెండవ విడత (29వ తేదిన) అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ప్రకటించింది. రెండు నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మగ్రహత్ పశ్చిమ్ నియోజకవర్గంలోని 11 పోలింగ్ బూత్‌‌లలో అలాగే  డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 పోలింగ్ బూత్‌‌లలో మే 2వ తేదిన రీపోలింగ్ జరుపనున్నట్టు ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. రీపోలింగ్‌కు సంబంధించి పోలింగ్ ఏరియాల్లో విస్తృతమైన ప్రచారం జరపాలని, పోలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఈసీ ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *