ఇజ్రాయిల్ పై పాకిస్తాన్ రక్షణ మంత్రి నోటి దూల వ్యాఖ్యలు
ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం,డ్రగ్స్ సఫ్లయ్ చేయడం,అమెరికా లాంటి దేశాలకు తొత్తూగా వ్యవహరిస్తూ వాళ్ల వేసే ఎంగిలి మెతుకులు తినే దేశం ఎదైన వుందా అంటే టక్కున గుర్తుకు వచ్చేది పాకిస్తాన్….అమిరికా,ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్దం నుంచి ఎదోక ఒక రూపంలో తప్పించుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షడు ట్రంప్,ఇరాన్ తో బ్యాక్ డోర్ ద్వారా చర్చలు జరిపేందుకు తన దూతగా పాకిస్తాన్ ఎంచుకున్నడు. ఎందుకంటే ట్రంప్ ఏది చేపితే అది చేసే బానిస దేశం పాకిస్తాన్….ఈ నేపధ్యంలో మరో రెండు ముస్లిం దేశాలతో కలసి, యుద్దంపై పోస్టుమెన్ డ్యూటీ చేసిన పాకిస్తాన్, యద్ద విరమణకు ఇరాన్ వచ్చిందని,చంకలు గుద్దుకున్నాడు. దేశాల మధ్య దౌత్యనీతి అంటే ఆషామాషి వ్యవహరం కాదు….మాట్లాడే ప్రతి పదం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాల్సి వుంటుంది. అయితే ఇలాంటి వ్యవహరాలు తెలియని బానిస దేశం అయిన పాకిస్తాన్ రక్షణ మంత్రి నోటి దూలతో చేసిన వ్యాఖ్యలు ఎలా వున్నాయో చూడండి…..
అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పాలని ఓవైపు పాకిస్థాన్ వేదికగా చర్చలు జరుగుతుంటే మరోవైపు ఆదేశ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, కీలకమైన జలమార్గం మూసివేతపై దౌత్య చర్చలు చేపడుతున్న తరుణంలో ఖాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “ఇజ్రాయెల్ దేశం క్యాన్సర్ లాంటిది అని లెబనాన్‌లో రక్తపాతం సృష్టిస్తున్నదని, అలాంటి దేశాన్ని సృష్టించిన వాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నట్లు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు”.
దీంతో పాకిస్థాన్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది.“ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి మాటలను సహించదని ఆదేశాధ్యక్షుడు నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు”. ఇస్లామబాద్ వేదికగా శాంతి చర్చలు జరిపేందుకు నాయకత్వం వహిస్తున్న పాకిస్థాన్ నుంచి ఇలాంటి పరిణామాలు ఊహించలేదన్నారు. ఆదేశం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. చర్చల వేళ ఇలాంటి పరిణామాలు ఎలాంటి అనిశ్చితికి దారి తీస్తాయోనని యుద్ద విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కథ ఏ మలుపు తిరుగుతుందొ.???

