RTC బస్సులు నగరంలో అన్ని స్టేజ్ లో అగుతాయి-జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి
నెల్లూరు: నగరంలో అన్ని సిటీ బస్సులు అగే ప్రతి స్టేజీలోను ఈ నెల 11వ తేది నుంచి అగుతాయని ఆర్జీసి జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. గురువారం ఆర్జీసి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బ్యాటరీ బస్సులు దాదాపు 100 వరకు జిల్లాకు రానున్నాయని తెలిపారు. అలాగే నగరం నుంచి నరసింహకొండ,మైపాడు,ముత్తుకూరు,పొదలకూరు,గూడూరు వైపు వెళ్లె ప్రతి పల్లెవెలుగు,ఆల్ట్రా పల్లెవలుగు బస్సులు అపడం జరుగుతుందన్నారు. RTC బస్టాండ్ నుంచి అయ్యప్పగుడి వరకు రూ.10,,కొత్తూరుకు రూ.20 టిక్కెట్ తో ప్రయాణించ వచ్చన్నారు.RTC అందిస్తున్న ఈ సౌకర్యంను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో RTC అధికారులు పాల్గొన్నారు.

