DISTRICTS

తమిళనాడు మత్స్యకారుల అక్రమ వేటకు శాశ్వత అడ్డుకట్టే లక్ష్యం-కలెక్టర్క్ల,ఎస్పీ

దక్షిణ కోస్తా జిల్లాల మత్స్యకార గ్రామ కాపులతో..

నెల్లూరు: తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ వేట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు. మత్స్యకారుల అభిప్రాయాల మేరకు పటిష్టమైన వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపడుతోందన్నారు. గురువారం నెల్లూరు టౌన్‌హాల్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 162 గ్రామాల మత్స్యకార కాపులు, మత్స్యకారులతో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా.అజితా ముఖాముఖీ సమావేశం నిర్వహించారు.

మత్స్యకార గ్రామాల కాపులు:- ఈ సందర్భంగా నాలుగు జిల్లాల నుంచి విచ్చేసిన మత్స్యకార గ్రామాల కాపులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ 650 హెచ్‌పి సామర్థ్యం గల స్టీల్ బోట్లనే కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణను ప్రభుత్వమే భరించాలని సూచించారు. మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలోని బోట్లకు రిపేర్లు చేయాలని, గస్తీ బోట్లలో పనిచేసే మత్స్యకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. తీర గస్తీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని, సబ్సిడీ పెంచితే తామే బోట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమిళనాడు జాలర్ల అక్రమ వేట, దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

నాలుగు జిల్లాలకు నాలుగు హైస్పీడ్ బోట్లు:- కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలకు నాలుగు హైస్పీడ్ బోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 15లోగా 4 హైస్పీడ్ బోట్ల కొనుగోలకు ప్రతిపాదనలు సిద్దంమన్నారు. తిరుపతి జిల్లాకు ఒకటి, నెల్లూరు జిల్లాకు రెండు, బాపట్ల జిల్లాకు ఒక బోటును మంజూరు చేయగా, ప్రకాశం జిల్లాకు కూడా బోటు మంజూరు చేసేలా ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. ఈనెల 12వ తేదీ ఆదివారం లోపు మత్స్యకారులంతా బోట్ల కొనుగోలుకు సంబంధించి పదిమంది లబ్ధిదారుల పేర్లను, వాట్సాప్ గ్రూప్ తయారు చేసేందుకు ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క మత్స్యకారుని పేరును తీర్మానించుకుని తమకు జాబితా అందించాలని కలెక్టర్ సూచించారు.

ఎస్పీ డా. అజితా వేజండ్ల మాట్లాడుతూ తమిళనాడు బోట్ల అక్రమ వేటకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై ఒక ప్రత్యేక కమిటీని నియమించుకునేందుకు మత్స్యకారులు ముందుకు రావాలని ఎస్పీ డా.అజితా వేజండ్ల సూచించారు. తమిళనాడు బోట్లను పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఎన్నిరోజులు ఉంచుకోవాలి, ఎన్ని కిలోమీటర్లు గస్తీ తిరగాలి వంటి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు, మత్స్యకారులతో ఒక కమిటీ ఏర్పడితే విధివిధానాలు తయారుచేసుకోవచ్చని ఎస్పీ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *