కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై నమ్మకం లేదు- ఇజ్రాయెల్ రాయబారి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్:-
అమరావతి: అమెరికా-ఇరాన్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై ఇజ్రాయెల్ సందేహం వ్యక్తంచేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాక్ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు,ఇజ్రాయిల్ భావిస్తున్నదని, అజార్ తెలిపారు. ఈ సందర్భంగా ఖతార్, తుర్కియే వంటి సమస్యాత్మక దేశాల ద్వారా హమాస్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం గురించి అజార్ ప్రస్తావిస్తూ, ఇరాన్‌లో తాము అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు యూఎస్ సమన్వయంతో ముందుకుసాగడం తమకు చాలా ముఖ్యమన్నారు. అమెరికా-ఇరాన్ ల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు మద్దతు తెలుపుతున్నట్లు వేల్లడిస్తూనే… లెబనాన్‌పై మాత్రం తమ సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్‌పై జరిపే ఆపరేషన్‌కు, లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపే దాడులకు ఎలాంటి సంబంధం లేదని అజార్ పేర్కొన్నారు. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్:- ఇజ్రాయెల్,,లెబనాన్ పై దాడులు చేస్తున్న నేపధ్యంలో ఇరాన్-అమెరికాల మద్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తూ,, హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవకపోతే అమెరికా కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండదని స్పష్టం చేశారు. హంగేరీ నుంచి బయలుదేరే సమయంలో ఎయిర్ ఫోర్స్ టూ విమానంలో మీడియాతో మాట్లాడుతూ, “కాల్పుల విరమణ అంటే పరస్పర ఒప్పందం. మేము ఒక నిర్ణయం తీసుకుంటే, వారు కూడా తమ వైపు నిబంధనలు నెరవేర్చాలి. హర్మూజ్ జలసంధి తెరవడం వారి బాధ్యత. అది జరగకపోతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని పాటించరు” అని హెచ్చరించారు.

