NATIONALPOLITICS

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానంకు చెప్పాను-బీజెపీ మాజీ అధ్యక్షడు అన్నామలై

అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై తమిళనాడు బీజెపీ మాజీ అధ్యక్షడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కేరళలోని కన్నూరులో ప్రచారం అనంతరం శనివారంనాడు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న సందర్బంలో ఆయన మీడియాతో మాట్లాడారు.మీడియా అడిగిన ప్రశ్నలకు అయన స్పందిస్తూ ఇదే విషయన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు తెలియజేసినట్టు చెప్పారు.’ఏ నియోజకవర్గానికి పోటీ చేసేది లేదని లిఖిత పూర్వకంగా పార్టీ కోర్ కమిటీకి తెలియజేశాను అన్నారు. అధిష్ఠానం ఆమోదానికి పంపిన పేర్ల జాబితాలో కూడా నాపేరు లేదు. అందువల్ల నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడం అనేదే లేదు. నేనే పోటీకి దూరంగా ఉన్నాననేది నిజం. మీడియాలో దీనిపై చర్చకు వచ్చినందునే ఈ వివరణ ఇస్తున్నాను’ అని అన్నామలై స్పష్టం చేశారు. ప్రస్తుతం పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్ 7 వరకూ ప్రచార బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందనీ, 7వ తేదీ నుంచి 23 వరకూ తమిళనాడులో ప్రచారం ఉంటుందనీ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని వెల్లడించారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఇన్‌చార్జిగా అన్నామలై ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *