హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన భారతీయ నౌకలు
బ్లూమ్‌బెర్గ్…భారత జెండా కలిగిన రెండు అతిపెద్ద గ్యాస్ క్యారియర్స్..
అమరావతి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో భారత్‌కు చెందిన రెండు నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. పెర్షియన్ గల్ఫ్ నుంచి భారత నౌకలు జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం ఉదయం హోర్ముజ్‌ను దాటాయి. త్వరలోనే ఈ నౌకలు దేశీయ పోర్టులకు చేరనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశీయంగా గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ నౌకల రాకతో గ్యాస్ లభ్యత పెరిగే అవకాశమున్నట్టు చెబుతున్నారు.
బ్లూమ్‌బెర్గ్:-
భారత్ పద్దతులను అనుసరిస్తున్న ఇతర దేశాల నౌకలు:- లిక్వీడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)ను తీసుకువెళ్తున్న భారత జెండా కలిగిన మరో రెండు నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్నాయని, షిప్-ట్రాకింగ్ డేటాను బ్లూమ్‌బెర్గ్ వార్త సంస్థ సోమవారం తెలిపింది. భారత జెండా కలిగిన రెండు అతిపెద్ద గ్యాస్ క్యారియర్ నౌకలైన ‘జగ్ వసంత్’- ‘పైన్ గ్యాస్’, సోమవారం తెల్లవారుజామున UAE తీరం నుంచి ఉత్తరం వైపుగా ఇరాన్‌లోని ఖేష్మ్-లారాక్ దీవుల వైపు ప్రయాణించాయని పేర్కొంది. ఇరాన్ ఆమోదించిన, ఆ దేశ తీరప్రాంతానికి దగ్గరగా ఉండే మార్గాన్నే భారతీయ క్యారియర్లు కూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. ఆ రెండు నౌకలు గమ్యస్థానానికి బదులుగా తమ ట్రాన్స్ పాండర్ల ద్వారా భారత యాజమాన్యాన్ని సంప్రదించాయని పేర్కొంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇతర నౌకలు కూడా ఈ ముందు జాగ్రత్త చర్యను అనుసరిస్తున్నాయని వెల్లడించింది.

