AP&TGCRIME

బైక్‌ నుంచి వచ్చే పొగ పీల్చి నలుగురు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తిరుపతి: అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం చోటుచేసుకుంది. బైక్‌ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు…

పుంగనూరు త్యాగరాజవీధిలో మురళీ కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బార్బర్‌ షాపు నిర్వహించే మురళీ శనివారం తన బైక్‌ రిపేరు చేయించారు. బండి ఇంజిన్ ను బోర్‌ చేయించడంతో, రాత్రంతా బైక్ ఆన్‌లో ఉంచాలని మెకానిక్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఇంట్లో కింద గదిలో బైకు ఆన్ లో వుంచాడు.ఈ గదిలోనే మురళీ తండ్రి రామచంద్ర, కుమారుడు, ఇద్దరు కవల పిల్లలు నిద్రించారు. మురళీ అయన భార్య ఇంట్లోని పైగదిలో నిద్రించారు.

బైక్‌ ఉంచిన గదిలో ఎలాంటి కిటీకీలు కూడా లేవు. రాత్రంతా బైక్‌ ఆన్‌లోనే ఉంచడంతో గది అంతా పొగ కమ్మేసి (బైక్ కు బోర్ చేసి రన్నింగ్ లో వుంచినప్పుడు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వాయువు) ఊపిరాడక రామచంద్ర, ఆతని మనవడు, ఇద్దరు మనవరాళ్లు చనిపోయారు. ఉదయం నిద్రలేచిన మురళీ గది తలుపులు తెరిచి చూసే సరికి అందరు చనిపోయి ఉన్నారు. కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదఛాయలు అలుముకున్నారు. కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. ప్రాథమికంగా ఊపిరాడకనే నలుగురు చనిపోయినట్లు తెలుస్తోందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *