వాణిజ్య భవనాల పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించండి- రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని కమర్షియల్ భవనాలు, షాపులకు సంబంధించిన పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి 100% వసూళ్లు సాధించేలా రెవెన్యూ విభాగం అందరూ కృషి చేయాలని పట్టణ పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ సూచించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ వై.ఓ నందన్ తో కలిసి రెవెన్యూ విభాగంతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది పన్నులు, చెల్లించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 కు సంబంధించి బకాయిలు ఉన్న వారిని నేరుగా సంప్రదించి వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొండి బకాయిలుగా ఉన్న వారిని గుర్తించి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని పన్నులు వసూలు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలం పన్ను, ఆస్తి పన్ను, తాగునీటి కుళాయి పన్నుల వసూళ్ళలో నిర్దేశించిన లక్ష్యాలను 100% సాధించేలా రెవెన్యూ విభాగం సిబ్బంది అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు,యస్.ఈ. రహంతు జానీ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్. చైతన్య,రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

