T20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ
స్కాట్లాండ్ జట్టుకు ఆహన్వం..
అమరావతి: ప్రపంచ స్థాయి వేదికల్లో క్రికెట్ అడాలంటే,,అందుకు తగిన నైపుణ్యం కోసం భారత్ కు సంబంధించిన కోచ్ లను నియమించుకున్న బంగ్లాదేశ్,,అటు తరువాత ప్రపంచ వేదికలపైన క్రికెట్ ను అడుతూ వస్తొంది.. తమ టీమ్ ప్రపంచ కప్ లో అడకుంటే,,స్పానర్స్ కూడా దిక్కు వుండరు అన్న స్థాయిలో కారుకూతలు కూసింది..
బంగ్లాదేశ్ కు దూల తీరింది:- ఈ నేపధ్యలో….భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిరాకరించడంతో,, ఫిబ్రవరి 7వ తేది నుంచి ప్రారంభం కానున్న ICC T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను ICC బహిష్కరించింది.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్ చరిత్రలో ఒక జట్టును ఈ విధంగా బయటకు పంపడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌లో మతపరమైన అల్లర్ల కారణంగా ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను IPL 2026 నుంచి తప్పించారు.ఈ పరిణామంపై బంగ్లా ప్రభుత్వం, బంగ్లా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందిస్తూ,, T20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలంటూ బీసీబీ,, ఐసీసీకి లేఖ రాసింది. సమయం తక్కువగా ఉండటంతో వేదికల మార్పు కుదరదని ఐసీసీ స్పష్టం చేసినప్పటికి, బీసీబీ మొండి వైఖరి ప్రదర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది.అయినప్పటికి బీసీబీ సహనం చూపుతూ,, భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు ఎలాంటి భద్రతాలోపం వాటిల్లదని ఐసీసీ హామీ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఐసీసీ ప్రతినిధులు ఢాకా వెళ్లి బీసీబీతో చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దీంతో బంగ్లాను ఈ మెగా టోర్నీ నుంచి తప్పిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.. ఇది న్యూ ఇండియా అనే విషయం గుర్తు వుంచుకోకుండా నోటీకి వచ్చినట్లు మాట్లాడితే, పర్యవసనాలు ఇలాగే వుంటాయి..బంగ్లాదేశ్ కు దూల తీరింది..

