జమ్ము కశ్మీర్లో తిరిగి ప్రారంభం అయిన విమాన సర్వీసులు
అమరావతి: పహాల్గయ్ ఉగ్రదాడుల తరువాత మూతపడిన జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్‌లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి..భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర,, వాయువ్య ప్రాంతాల్లో దాదాపు 32 విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు..ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం సదరు విమానాశ్రయాలు తిరిగి తెరుచుకున్నాయి..అయితే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కూడా అధికారులు సోమవారం తెరిచినప్పటికీ విమాన కార్యకలాపాలు మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.. మంగళవారం ఎయిర్ ఇండియాకు చెందిన AI 827 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు..దాదాపు ఆరు రోజుల తర్వాత ఈ ఎయిర్పోర్ట్ లో విమాన కార్యకలాపాలు మొదలు కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..ఛండీగఢ్, అమృత్‌సర్‌లో విమానాల రాకపోకలు ప్రారంభమైనట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) స్పష్టం చేసింది.. ప్రయాణికులు విమానాల స్టేటస్ కోసం ఆయా సంస్థల ఎయిర్‌లైన్స్ లను నేరుగా లేదా వారి వెబ్సైట్ల ద్వారా వివరాలను తెలుసుకోవాలని AAI సూచించింది.

