హోర్మూజ్ జలసంధిలో మళ్లీ మొదలైన ఉద్రికత్తలు
అగిపోయిన నౌకలు..
అమరావతి: కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన కొద్ది గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని, హర్మూజ్ జలసంధి వద్ద నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని అన్నారు. అందుకే ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అంకారలో 2026 నాటో శిఖరాగ్ర సదస్సు వచ్చిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం “ముగిసిపోయిందని”, టెహ్రాన్‌తో వ్యవహరించడం “సమయం వృధా” అని ట్రంప్ అన్నారు. హోర్ముజ్ జలసంధిలో ఖతారీ, సౌదీ ట్యాంకర్లతో సహా మూడు నౌకలపై జరిగిన దాడులు జరిగాయని,దింతో ఇరాన్‌పై “శక్తివంతమైన దాడులు” జరిపినట్లు ప్రకటించారు.
రెండో రోజు రాత్రి కూడా దాడులు చేస్తాం:- గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో, యూఎస్ ప్రతిదాడులు ప్రారంభించింది. వరుసగా రెండో రోజు రాత్రి కూడా దాడులు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అవసరమైతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, డీశాలినేషన్ (సముద్రపు నీటిని శుద్ధి చేసే) ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం ఖర్గ్ ద్వీపంపై దాడులు చేసినప్పటికీ, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.
హోర్మూజ్ జలసంధిలో 198 మంది నావికులు-9 భారత నౌకలు:- హోర్మూజ్ జలసంధి దిగ్బంధనం కావడంతో ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లోనే తొమ్మిది భారతీయ చమురు ట్యాంకర్లు చిక్కుకుపోయాయి. వీటిలో పూర్తి స్థాయిలో ముడిచమురు, LPG లోడ్ అయి ఉన్నట్లు సమాచారం. ఈ నౌకల్లో 198 మంది భారతీయ నావికులు ఉన్నట్లు తెలుస్తొంది. మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో వీరి రక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పర్షియన్ గల్ఫ్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను, భారత నౌకల గమనంను కేంద్రం ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. అగిపోయిన 9 చమురు ట్యాంకర్లకు మార్గాన్ని సుగమం చేయడంతో పాటు, 198 మంది భారతీయ నావికులను క్షేమంగా తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ప్రణాళికలు అడుగులు వేస్తొందని సమాచారం.

