నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట-మంత్రి సత్యకుమార్
కారుణ్య మరణాలకు..
అమరావతి: తీవ్రమైన వ్యాధులకు గురై, చికిత్సకు లొంగని స్థితిలో, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా అటువంటి వారికి కారుణ్య మరణం లభించేలా విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఏమాత్రమూ లేక చికిత్సల పేరిట నానా ఇబ్బందులు పడే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరట కల్పించనుంది.
గౌరవప్రద మరణం పౌరుల ప్రాథమిక హక్కు:- భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద గౌరవప్రదమైన మరణం పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు ఇందుకు సంబంధించి 2018లో ‘కామన్ కాజ్ ‘ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో ఇచ్చిన తీర్పునకు జనవరి,2023లో కొన్ని సవరణలు చేసింది. అంతకు ముందు అవసాన దశలో ఉన్న వారికి వైద్యులందించే లైఫ్ సపోర్ట్ సిస్టంను ( వెంటిలేటర్ సపోర్ట్ వంటివి) తొలగించేందుకు సంబంధించి ఎటువంటి చట్టపరమైన నిబంధనలు లేకపోవడంతో ఆసుపత్రులు, వైద్యులు, రోగుల కుటుంబాలకు పలు చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. దీని కారణంగా…చికిత్స నిష్ప్రయోజనమని తెలిసినా కృత్రిమంగా రోగులు ఊపిరి పీల్చుకుంటూ పలు కష్టనష్టాలకు గురయ్యేవారు.
కారుణ్య మరణాలకు మార్గదర్శకాలు:- అవసాన దశలో ఉన్న రోగులకు సహజ రీతిలో కారుణ్య మరణాల అవకాశాలను కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా రూపొందించిన మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి బుధవారంనాడు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా రోగుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ చికిత్సనందించే వైద్యులు, కారుణ్య మరణాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే రోగుల కుటుంబీకులకు చట్ట పరమైన రక్షణ లభిస్తుంది.
ఎటువంటి అవకతవకలకు వీలులేకుండా ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్-జిల్లా స్థాయి డిఎంహెచ్వోలను ప్రభుత్వం బాధ్యులను చేసింది.
9 ప్రధాన మార్గదర్శకాలు:-

