సంస్కృతి,భాష,వేషం వేరైనా మనందరం ఒక్కటే-మన సంస్కృతి దేవాలయాల సంస్కృతి-ముఖ్యమంత్రులు
-58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పలువురు ఇందులో పాల్గొన్నారు.
–ITCX ద్వారా 58 దేశాల అంతటా 1581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతోంది.
–ఈ 3 రోజుల కన్వెన్షన్ నందు స్థిరత్వ-పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన-సమ్మతి, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది.
–ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న భారతీయ జీవన విధానమే సనాతన ధర్మం
–మనమందరం సనాతులం
–దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాలను చూస్తే ఇప్పటికి ఆశ్చర్యం కలుగుతుంది
–పురాతన ఆలయాలు మన చరిత్రను తెలియజేస్తుంటాయి
–చోళులు, పల్లవులు, శ్రీక్రిష్ణదేవరాయలలు నిర్మించిన దేవాలయాలు ఎంతో అద్భుతమైన నిర్మాణాలు
–సనాతన ధర్మాన్ని ఆచరించడం అందరి కర్తవ్యం
తిరుపతి: టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 2025 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తిరుపతిలోని ఆశ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నఅంతర్జాతీయ దేవాలయాల సమావేశ ఎక్స్పో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు,మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ లు ప్రారంభించారు..
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ధర్మం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. గోవులను పూజించాలని, గోవులను రక్షించాలని సూచించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మన హిందూ ధర్మం సంస్కృతి కాపాడడంలో ప్రముఖ పాత్ర వహించారు అని అన్నారు. మన దేశంలో అనేక సంస్కృతి లు ఉన్నాయని, దేవాలయాల ద్వారా మనమంతా ఒక్కటిని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడంలో మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందంజలో ఉన్నారని తెలిపారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ సనాతన దేవాలయాలను గతంలో పలువురు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారని అన్నారు. దక్షిణ భారత దేశంలో పలు పురాతన అద్భుత దేవాలయాలు ఉన్నాయని అప్పటి శిల్ప కళ, ఆధ్యాత్మికత ఎంతో గొప్పదని పేర్కొన్నారు. మన దేశంలో గొప్ప సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాగ్ రాజ్ వంటి పవిత్ర పుణ్య నదులు ఉన్నాయని తెలిపారు. సనాతన భక్తి భావం పెంపొందించడంలో ఈ టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో చాల మంచి కార్యక్రమం అని రాబోవు కాలంలో హిందువుల సమైక్యత, సంస్కృతి కాపాడడంలో గొప్ప మార్పు తెస్తుందని దృఢ నమ్మకం ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మన సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా… అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయని తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సోమవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేవాలయ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం, వాటికి సాధికారత కల్పించడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే విషయంలో ఐటీసీఎక్స్ సేవలు అందిస్తోందని అన్నారు. 17 దేశాల నుంచి 1,581 దేవాలయాలను ఏకంచేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఐటీసీఎక్స్ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.రాబోయే రోజుల్లో దేవాలయాల అభివృద్ధికి సరికొత్త మార్గం చూపించే ప్రయత్నమే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ముఖ్య ఉద్దేశం-సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా ఈ సదస్సు మారనుందన్నారు.