ప్లాన్ ప్రకారం లేకుండా నిర్మాణలను జరిగితే ముందు నోటీసులు తరువాత చార్జీషీట్లు-కమీషనర్
నెల్లూరు: అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలకు, ప్లాన్ ప్రకారం లేకుండా జరుగుతున్న నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే ఛార్జ్ షీట్లను దాఖలు చేయాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు..సోమవారం స్థానిక 41 డివిజన్ కోనేటి మిట్ట, సిఎన్ఆర్ ప్లాట్స్, వాకర్స్ రోడ్డు, శివాలయం సెంటర్, ఇరగాలమ్మ గేట్ సెంటర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ అధికారులు, వార్డు సచివాలయం కార్యదర్శులతో కలిసి పర్యటించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయాల పాలైన ఆవును గుర్తించిన కమిషనర్ దాని సంరక్షణ బాధ్యతలను వెంటనే తీసుకోవాలని వెటర్నరీ వైద్యున్ని ఆదేశించారు.. స్థానిక డివిజన్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ తీగలు స్తంభాలకు కిందికి వేలాడుతుండటం గమనించిన కమిషనర్, సంబంధిత ఎనర్జీ అసిస్టెంట్ ఈ సమస్యను విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు..ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, రెవెన్యూ విభాగం అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.