సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం
హైదరాబాద్: ఖైరతాబాద్ గణనాధుని దర్మనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు..ఖైరతాబాద్ గణేష్ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం మంగళవారం జరగనున్నప్పటికి,సోమవారం నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను గణేషుడి దర్శనానికి అనుమతించరు..స్వామిని ఆదివారం మాత్రమే దర్శించుకునేందుకు అవకాశం ఉండటంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఖైరతాబాద్‌కు తరలిరావడంతో, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది..పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్:- ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్ 17వ తేది మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు..ఉదయం 6.30 గంటలకు పూజలు ముగించుకుని,, నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు.