భారత్ లో పర్యాటిస్తున్న ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు..
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు..ఆయన పట్ల గౌరవ సూచకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానశ్రయానికి చేరుకుని సాదర స్వాగతం పలికారు.. ప్రధాని వెంట విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఉన్నారు..ఈ నెల సోమ,,మంగళవారాల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది..ఆయన గౌరవార్ధం రాష్ట్రపతి విందు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.. అనంతరం ప్రధానమంత్రితో చర్యలు జరుపుతారు.. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, ప్రాంతీయ అంశాలపై ఉభయులూ చర్చిస్తారు..అనంతరం పలు ఎంఓయూలు కుదుర్చుకుంటారు.. ఖతార్ అమీర్ పర్యటన ఉభయదేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందేందుకు దోహదపడనుందని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది.