పాకిస్తాన్ లో ట్రెయిన్ హైజక్ చేసిన బలోచిస్థాన్ వేర్పాటువాదులు
అమరావతి: పాకిస్తాన్ లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ లోని ప్రయాణికుల రైలుపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ(వేర్పాటువాదులు) కాల్పులతో దాడి చేశారు..మంగళవారం బలోచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖారబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు దాదాపు 400 మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్ ప్రెస్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.. అంతర్జాతీయవార్త సంస్థల కథనాల ప్రకారం వేర్పాటువాదులు రైల్వేట్రాక్‌ను పేల్చేయడంతో జాఫర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది..రైల్వే ట్రాక్ ప్రక్కన దాక్కుని వున్న బలోచ్ వేర్పాటువాదులు వెంటనే రైలును తమ అధీనంలోకి తీసుకుని ప్రయాణికులను బంధించారు.. ఆరుగురు ఆర్మీ సిబ్బందిని కాల్చిచంపినట్టు, 120 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమపై మిలటరీ చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పని, బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది..
సమాచారం తెలియగానే తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది.. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఏర్పడింది..అప్పట్నించీ పలు హింసాత్మక దాడులకు పాల్పడటంతో ఆ సంస్థను పాక్, అమెరికా, యూకేలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.