రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు-మాజీ సీ.ఎం జగన్
అమరావతి: వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు..మంగళవారం ఎన్టీఆర్ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జీ సమక్షంలో హాజరై వాగ్మూలం ఇచ్చారు..ఆ వాగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారని ఆరోపించారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు, వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు..2024 జూలై 10న ఆ కేసు రీ ఓపెన్ చేశారు.. వంశీపై చంద్రబాబు పెట్టుకున్న ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే, ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా, ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారని మండిపడ్డారు..తప్పు చేసిన వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు గౌరవం ఉంటుంది.. కానీ నేడు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైలులో పెడుతున్నారని,,దీనికి నిదర్శనం వంశీపై పెట్టిన కేసు అన్నారు.