పశ్చిమాసియా సంక్షోభం కారణంగా డీజిల్, పెట్రోల్‌పై దాదాపు రూ.75 వేల కోట్ల నష్టం-ప్రధాని మోదీ
అమరావతి: ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ మథ్య ఏర్పాడిన ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడిన విషయం విదితమే…ఆ అంశంపై విపక్షాలు ప్రజల్ని భయాందోళలనలకు గురి చేశాయని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి, రాజకీయం చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. శనివారం రాజస్థాన్‌లోని బలోత్రాలో పెట్రోకెమికల్ రిఫైరీని ప్రారంభించిన అనంరతం ప్రధాని మోదీ ప్రసంగించారు. పశ్చిమాసియా యుద్ధ సమయంలో వివిధ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలు భారత్‌కు కలిసి వచ్చినట్లు ప్రధాని తెలిపారు.
40 దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి:- విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్లు సక్సెస్ కాలేదన్నారు.దేశంలో ఇంధన,గ్యాస్ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకకుండా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుందన్నారు.అయితే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో, వివిధ ఇంధన కంపెనీలు డీజిల్, పెట్రోల్‌పై దాదాపు రూ.75 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని అన్నారు.ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందన్నారు. లీటరుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించి ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూశామన్నారు. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు కేవలం 26 దేశాల నుంచి మాత్రమే భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకునేదని, సంక్షోభ సమయంలో భారత్ దాదపు 40 దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమమే కీలకమన్న విషయాన్ని ప్రభుత్వం చాటి చెప్పిందన్నారు.

