AP&TG

సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠినమైన చర్యలకు సిద్దం-మంత్రి పార్థసారధి

ప్రత్యేక State Task Force ఏర్పాటు…

అమరావతి: సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని, రాష్ట్ర స్థాయి ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు, సమగ్ర చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధం అయిందని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.శుక్రవారం సీ.ఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.

అసభ్యకర పోస్టులు:- సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలు వంటి పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు, ప్రభుత్వ వ్యవస్థలకు, సామాజిక సామరస్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చట్టపరంగా జైలుకు:- ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టాల్లో ఉన్న అవకాశాలు, లోపాలను పరిశీలించి, చట్టపరమైన అన్ని మార్గాలను వినియోగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే నేరస్థులను చట్టపరంగా జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా సెల్:- ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక Social Media Response Cell ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక State Task Force ఏర్పాటు అంశాలు ఉన్నట్లు తెలిపారు.

అనంతరం క్యాబినెట్ లో తీసుకున్న పలు నిర్ణయాలను వివరించారు.35 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార-పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *