AP&TGCRIME

ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం-7 బస్సులు అగ్నికి అహుతి

అమరావతి: విజయవాడలోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 7 ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు అయ్యాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ మెకానిక్ షెడ్డులో మరమ్మతుల కోసం బస్సులను నిలిపి ఉంచారు. ఆదివారం 11.30 గంట సమయంలో ఓ బస్సుకు మెకానిక్ వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిరిపడి మంటలు చెలరేగాయని సమాచారం. ఆ మంటలు కొద్దిసేపటికి మిగిలిన బస్సులకు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా నల్లటి పొగతో నిండిపోయింది. పక్కనే మరికొన్ని బస్సులు పార్కింగ్ చేసి ఉండటంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.4 ఫైరింజన్లు సంఘటన స్థలంకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *