NATIONAL

65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంగళవారం పద్మ అవార్డులు అందజేశారు. మొత్తం 2 పద్మ విభూషణ్‌, 7 పద్మభూషణ్‌, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ, సాహిత్య, వైద్య, క్రీడా తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాలను అందుకున్నారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు కూడా పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌తో పాటు నటుడు ఆర్. మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెటర్‌ రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. దేశ అభివృద్ధికి, తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంత్సరం పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తోంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *