ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో
అమరావతి: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన శనివారం నాడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో, ఢిల్లీలో సమావేశం అయ్యారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తొంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ భద్రత అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
శనివరం భారత్ కు చేరుకున్న రుబియో, తొలుత కోల్‌కతాకు వెళ్లి మథర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రుబియో భారత పర్యటనలో ముఖ్యంగా క్వాడ్ భాగస్వామ్యం, చైనా ప్రభావం, సరఫరా గొలుసులు, రక్షణ సహకారం, ఇంధన భద్రత వంటి అంశాలు ప్రధాన చర్చించినట్లు తెలుస్తొంది. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. మార్కో రుబియో ఆదివారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చర్చలు జరపడంతో పాటు, మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవుతారు. ఆయన ఆగ్రా, జైపూర్లను కూడా సందర్శించనున్నారు.

