NATIONAL

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చు-ఆర్బీఐ గవర్నర్

నెలకు రూ.30 వేల కోట్ట నష్టాలు…

అమరావతి: హర్మోజో జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరి కొంతకాలం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న సందర్బంలో RBI గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఎక్కువకాలం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపక తప్పదని, ప్రస్తుతం చమురు కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చమురు కంపెనీలు నెలకు రూ.30 వేల కోట్ట రూపాయల నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రిస్తున్నాయని చెప్పారు. అయితే ఇది ఎంతకాలం సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకమని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *