తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధించి కోర్టు
దోషులు తమ అధికారాన్ని దుర్వినియోగపరిచారు..
కస్టడీలో ఉండగా వారు మరణించడం..
కొన్ని సమయాల్లో పోలీసులు యూనిఫాం వెసుకుంటే తమకు ఎలాంటి చట్టాలు వర్తించవు అన్న విధంగా అత్యంత క్రూరంగా,పాశవికంగా వ్యవహరిస్తారు. కోర్టులు,చట్లాలు తమని ఎం చేయలేవు అన్న రీతిలో వీరి నైజం వుంటంది. అలాంటి పోలీసులకు, తప్పు చేస్తే చట్టం నుంచి ఎంతటి వారైన,తప్పించుకేరు అనేందుకు మధురై రోర్టు ఇచ్చిన తీర్పు పోలీసుశాఖలో కొంత మంది అవినితి,క్రూరమైన మనస:తత్వం వున్న వారికి చెంప పెట్టులాంటి…. విషయంలోకి వెళ్లితే
అమరావతి: ఆరేళ్ల క్రితం తూత్తుకుడి జిల్లాలో వ్యాపారి పి.జయరాజ్, అతని కుమారుడు జె.నిక్స్ లాకప్ డెత్ కేసులో తమిళనాడులోని మదురైలో ఫస్ట్ అడిషనల్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సోమవారం తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధించింది.ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజా ఆగ్రహానికి కారణమైంది.
కస్టడీలో ఉండగా వారు మరణించడం:- తూతుకుడి జిల్లాలో 2020 కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సమయం షాపును నిర్వహించిన కేసులో షాపు యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉండగా వారు మరణించడంతో ఘటనపై దర్యాప్తు మొదలైంది. స్టేషన్‌లో వారిని టార్చర్ చేయడంతో తీవ్రగాయాల పాలై మరణించినట్టు అధికారులు తేల్చారు.
దోషులు తమ అధికారాన్ని దుర్వినియోగపరిచారు:- ఈ కేసులో దోషులకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దోషులు తమ అధికారాన్ని దుర్వినియోగపరిచారని, అత్యంత క్రూరంగా ప్రవర్తించారని అభిప్రాయపడింది. విధి నిర్వహణలో వున్న ఒత్తిడి కారణం అంటూ తప్పించుకోలేరని, దీన్ని అత్యంత అరుదైన కేసుగా పేర్కొంది. ఈ కేసులో దోషులుగా తేలిన ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు పి.రఘు గణేశ్, కే. బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ మురుగన్, ఎ సమదురై, కానిస్టేబుల్స్ ఎమ్ ముత్తురాజ్, ఎస్ చెల్లదురై, ఎక్స్ థామస్ ఫ్రాన్సిస్, ఎస్ వైల్‌ముత్తులకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసులో పదవ నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై కొవిడ్‌తో గతంలో మరణించాడు.

