487 కి.మీ.ల మేర’కవచ్’ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసిన దక్షణ మధ్య రైల్వే
రైళ్ల వేగం పెరుగుతుంది..
ప్రయాణికులకు మరింత భద్రత..
అమరావతి: రైల్వే మంత్రిత్వశాఖ రైలు ప్రయాణంలో ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రారంభించిన మేర ‘కవచ్’ రక్షణ వ్యవస్థ 4.0ను వేగంగా పూర్తి చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నేపధ్యంలో దక్షణ మధ్య రైల్వే రైల్వే భద్రతా వ్యవస్తలను బలొపేతం చేసే దిశగా ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో బాగంగా 2025-26 లో జోన్ నెట్వర్క్ వ్యాప్తంగా ‘కవచ్ 4.0’-స్వదేశీయంగా రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థను ఏర్పాట్లు చేశారు. దీనికి అనుగుణంగా, రైల్వే బోర్డు నిర్దేశించిన 402 రూట్ కి.మీ.ల లక్ష్యాన్ని అధిగమిస్తూ, ఈ జోన్ 487 రూట్ కి.మీ.ల మేర క్షేత్ర స్థాయి ‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థను కూడా ప్రారంభించింది.
‘కవచ్’ రక్షణ వ్యవస్థ 4.0:- ఒకే దిశలో ప్రయాణించే రైళ్లు, వెనుక నుంచి మరో రైలు ఢీకొనే ప్రమాదం లేకుండా, సురక్షితంగా ఒకదాని వెనుక ఒకటి ప్రయాణించేలా అనుమతించే విధంగా ఈ ‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థ రూపొందించబడింది.ఇది రైల్వే నిర్వహణ ఖర్చులను వ్యయాలను తగ్గిస్తుంది, రైల్వే సెక్షన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడడంతో పాటు రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. దక్షిణ మధ్య రైల్వే ఈ వ్యవస్థను ప్రారంభంలో నెట్వర్క్ లోని అధిక రద్దీ గల ప్రధాన రైలు మార్గాలలో అమలు చేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్-కవచ్ క్షేత్రస్థాయి ప్రయోగాలను రికార్డు స్థాయిలో ప్రారంభించడంలో జోనల్-డివిజనల్ స్థాయిలలోని సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ విభాగాల అధికారుల ఉత్తమ పనితీరును-వారి కృషిని అభినందించారు.

