NATIONALOTHERSWORLD

పాకిస్తాన్,అదుపు మిరితే, దాడులు తప్పవు-హెచ్చరించిన ఆర్మీ చీఫ్ జనరల్

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత సంవత్సరం మే నెలలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఎలాంటి కుట్రలకు  పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. 2026లో మొదటి సారి ఆర్మీ చీఫ్ జనరల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎలాంటి పొరపాట్లు చేసిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఆర్మీ మోహరించిన బలగాలు భూతల దాడులు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నాయన్నారు.

పాక్‌ అదుపులో ఉండాల్సిందిగా:- జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా-రాజౌరి సెక్టార్‌లో  జనవరి 10వ తేదిన సుమారు 6 డ్రోన్‌లు, జనవరి 11,12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని చెప్పారు. పాకిస్థాన్ వైపు నుంచి భారత భూబాగం వైపు వచ్చిన డ్రోన్‌ల సంచారాన్ని గుర్తించడంపై వ్యాఖ్యనిస్తూ, ఈ అంశం మంగళవారం నాడు పాకిస్థాన్‌ డీజీఎంఓ స్థాయిలో ఈ ఆంశం ప్రస్తావనకు వచ్చిందని, పాక్‌ అదుపులో ఉండాల్సిందిగా చెప్పామన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందన్నారు.

ఉగ్రవాద శిబిరాల్లో ఇప్పటికీ:- జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయని, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని ద్వివేది తెలిపారు.ఎనిమిది ఉగ్రవాద శిబిరాల్లో ఇప్పటికీ కదలికలు ఉన్నాయని,, వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయన్నారు. చురుగ్గ కదలికలు కానీ శిక్షణా కార్యకలాపాలు జరిగినట్లు గుర్తిస్తే అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంటాం అని ద్వివేది చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో 88 గంటల పాటు సైన్యం అత్యంత సమర్థవంతంగా పనిచేసిందనిన్నారు. కవ్వింపు చర్చలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పాక్‌ను హెచ్చరించారు.

65 శాతం మంది పాకిస్థాన్‌:- జమ్మూకశ్మీర్‌లో 2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులను హతమార్చామని, వారిలో 65 శాతం మంది పాకిస్థాన్‌ సంతతి వారేనని తెలిపారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు కూడా వీరిలో ఉన్నారని తెలిపారు. ఉగ్రవాద శ్రేణుల్లోకి కొత్తగా నియామకాలు దాదాపు లేనట్లు కన్పిస్తొందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *