AP&TG

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ప్రఖర్ జైన్

బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్..

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ముప్పు..

ఎల్లుండి మధ్యాహ్నం నరసాపురం–పూరీ మధ్య తీరం దాటే అవకాశం..

గంటకు 90–100 కి.మీ వేగంతో..

అమరావతి: బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 09 కిమీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ తెలిపారు. నరసాపురానికి 500 కిమీ, కళింగపట్నంకి 540కిమీ, చెన్నైకి 560 కిమీ, గోపాల్‌పూర్‌కి 630 కిమీ, పూరీకు 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి రేపు గంటకు 60-70 కి.మీ గరిష్టంగా 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం తీరం దాటే అవకాశం:- అక్వాన్ తీవ్ర తుపాన్ ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం–పూరీ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్‌గా దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించింది.

ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:- తుపాన్ ప్రభావం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుపాన్ కదలికలు, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *