AP&TGPOLITICS

రాష్ట్రంలో మిగిలిన పట్టణ స్థానిక సంస్థలు,పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. గురువారం నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు, పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ, సట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికల సంబంధించి నామినేషన్లు, పోలింగ్, ఫలితాల వివరాలను వెల్లడించారాయన. రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనుండగా, ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది.

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు:- నవంబర్ 13న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ కానుంది. 15వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ–17వ తేదీ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ–18వ తేదీన నామినేషన్ల పరిశీలన–19, 20 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణ, సంబంధిత అంశాలపై అప్పీళ్లకు అవకాశం–21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు–21వ తేదీన పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన–26వ తేదీన పోలింగ్–26వ తేదీన ఫలితాల వెల్లడి..(27వ తేదీన రీపోలింగ్, ఎక్కడైనా పోలింగ్ రద్దైన.. వాయిదా పడిన చోట).

రెండవ విడత:-నవంబర్ 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ–20వ తేదీ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ–21వ తేదీన నామినేషన్ల పరిశీలన–22, 23 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణ, సంబంధిత అంశాలపై అప్పీళ్లకు అవకాశం–24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు–24వ తేదీన పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన–29వ తేదీన పోలింగ్–29వ తేదీన ఫలితాల వెల్లడి.(30వ తేదీన రీపోలింగ్. ఎక్కడైనా పోలింగ్ రద్దైన.. వాయిదా పడిన చోట).

3వ విడత:- నవంబర్ 19వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల-21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ–23వ తేదీ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ–24వ తేదీన నామినేషన్ల పరిశీలన–25, 26 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణ, సంబంధిత అంశాలపై అప్పీళ్లకు అవకాశం–27వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు–27వ తేదీన పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన–డిసెంబర్ 2వ తేదీన పోలింగ్–డిసెంబర్ 2వ తేదీన ఫలితాల వెల్లడి—(డిసెంబర్ 3వ తేదీన రీపోలింగ్. ఎక్కడైనా పోలింగ్ రద్దైన.. వాయిదా పడిన చోట).ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *