AP&TGCRIME

ఎంపీటీసీ ఫలితాలకు ముందే గుండెపోటుతో జనసేన అభ్యర్ది దివ్య మృతి

అమరావతి: ఎన్నికల ఫలితం కోసం గ్రామస్తులు అంతా ఎదురుచూస్తున్న సమయంలో అభ్యర్థి కౌంటింగ్‌కు ముందే మరణించిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఆమె గుండెపోటుతో మరణించారు. ఎన్నికల ఫలితాల్లో దివ్య, వైసీపీ అభ్యర్థిపై 352 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికి దివ్య లేకపోవడం గ్రామస్థులను కలచివేస్తోంది. గెలుపు వార్త తెలిసిన తర్వాత గ్రామంలో ఆనందం కంటే విషాదమే ఎక్కువగా కనిపిస్తోంది.

దివ్యకు ప్రేమ వివాహం అయింది. ఆమెకు ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం, ఇద్దరు చిన్నారులకు తల్లి దూరం కావడం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను మరింత విషాదంలోకి నెట్టింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *