సోమవారం పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు- జిల్లా కలెక్టర్
మురసు తుపాను’ హెచ్చరిక..
తీరం దాటే సమయంలో 120 కిమీ వేగంతో..
నెల్లూరు: మురసు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నవంబర్ 02న (సోమవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జానియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు జిల్లా వ్యాప్తంగా విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మురసు తుపాను’ హెచ్చరిక:- గడచిన 6 గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ప్రస్తుతం చెన్నైకి 420 కిమీ, నెల్లూరుకు 490 కిమీ, మచిలీపట్నానికి 500 కిమీ, ఒంగోలుకు 530 కిమీ , విశాఖపట్నానికి 560 కిమీ దూరంలో ఉందని వాతావరణశాఖ తెలిపింది.సోమవారం తెల్లవారు జామున తీవ్ర తుపానుగా బలపడి వాయువ్య దిశగా ప్రయాణించి రేపు అర్థరాత్రి-ఎల్లుండి తెల్లవారు జామున నెల్లూరు-నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొంది. తీరం దాటే సమయంలో గంటకు100 నుంచి 110 కిమీ వరకు గరిష్టంగా 120 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

